జాతీయ స్థాయి కరాటే పోటీలకు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 13 మంది ఎంపిక

 జాతీయ స్థాయి కరాటే పోటీలకు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 13 మంది ఎంపిక

గోదావరిఖని, వెలుగు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా గోదావరిఖనిలోని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీవో క్లబ్​ఆవరణలో నిర్వహించిన అండర్–17 రాష్ట్ర స్థాయి కరాటే పోటీల సెలక్షన్స్​ సోమవారం ముగిశాయి. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి పది జిల్లాల నుంచి 240 మంది కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు. 

వివిధ స్థాయిల్లో జరిగిన పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఎంపిక కాగా, వీరిలో ఉమ్మడి కరీంనగర్​ జిల్లా నుంచే 13 మంది ఉన్నారు. వీరు 2026 జనవరి 30, 31 తేదీల్లో పుణేలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. 

ఉమ్మడి జిల్లా నుంచి గోల్డ్​ మెడల్స్​సాధించిన టి.జయసాయి చరణ్​, సృష్టి, శ్రీవర్ష, శ్రీవల్లి, పి.శ్రీజ, బి.సహస్ర, పి.సహస్ర, శ్రీరాజ్, విఘ్నేశ్‌‌‌‌‌‌‌‌, ఆకాశ్‌‌‌‌‌‌‌‌, డి.శివ, హర్షవర్దన్, డి.దేవాన్ష్​ను పెద్దపల్లి జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్, అబ్జర్వర్ డాక్టర్ దాసరి మల్లేశ్‌‌‌‌‌‌‌‌, రాష్ట్ర అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్, శోభారాణి, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఉమ్మడి జిల్లా కార్యదర్శి శంకర్, గోదావరిఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మాధవరావు, తదితరులు అభినందించి సర్టిఫికెట్లను అందజేశారు.