గోదావరిఖనిలో పోలీసుల నాకాబందీ : ఏసీపీ ఎం.రమేశ్‌‌‌‌‌‌‌‌

గోదావరిఖనిలో పోలీసుల నాకాబందీ : ఏసీపీ ఎం.రమేశ్‌‌‌‌‌‌‌‌

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలోని పలు ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున నాకాబందీ నిర్వహించారు. స్థానిక ఫైవింక్లయిన్​ చౌరస్తా ఏరియాలో పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ ఎం.రమేశ్‌‌‌‌‌‌‌‌ వాహనాలను చెక్​ చేశారు. అలాగే తిలక్​నగర్​, రమేశ్‌‌‌‌‌‌‌‌నగర్, జవహర్​నగర్​, ద్వారకానగర్​, పరుశురామ్‌‌‌‌‌‌‌‌నగర్, తదితర ప్రాంతాల్లోనూ కార్డెన్‌‌‌‌‌‌‌‌ సెర్చ్‌‌‌‌‌‌‌‌ చేపట్టారు. 

డాక్యుమెంట్లు లేని వాహనాలను పోలీస్​స్టేషన్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. డీసీపీ మాట్లాడుతూ శాంతిభద్రతలను కాపాడేందుకు నాకాబందీ నిర్వహించినట్టు తెలిపారు. వన్​టౌన్​సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌‌‌‌‌‌‌‌ఐ రమేశ్‌‌‌‌‌‌‌‌, సిబ్బంది పాల్గొన్నారు.