కమ్యూనిస్టులు ఐక్యంగా ఉంటేనే బలమైన శక్తి : మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

కమ్యూనిస్టులు ఐక్యంగా ఉంటేనే బలమైన శక్తి : మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

కరీంనగర్ సిటీ, వెలుగు: కమ్యూనిస్ట్ పార్టీలు ఐక్యంగా ఉంటేనే బలమైన శక్తి మారొచ్చని సీపీఐ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. సోమవారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బద్దం ఎల్లారెడ్డిభవన్‌‌‌‌‌‌‌‌లో సీపీఐ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులు, గ్రామ శాఖ కార్యదర్శుల జాయింట్ మీటింగ్‌‌‌‌‌‌‌‌ జరిగింది. 

ఈ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి ఎర్రజెండా పార్టీ సీపీఐ అని, దీని నుంచే అనేక కమ్యూనిస్టు పార్టీలు పుట్టుకొచ్చాయన్నారు. దేశంలో బీజేపీ కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ శక్తులకు కొమ్ము కాస్తూ దేశ సంపదను ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ వ్యక్తులకు కట్టబెడుతోందన్నారు. మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలను విచ్చలవిడిగా ప్రైవేట్ పరం చేస్తోందన్నారు. 

సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్న నేపథ్యంలో జనవరి 18న ఖమ్మంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి, పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు సృజన్ కుమార్, అశోక్, లక్ష్మి, బాబు, లక్ష్మారెడ్డి, తిరుపతి, సమ్మయ్య, రాజు పాల్గొన్నారు.