డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ రహిత సమాజం కోసం పాటుపడాలి : సీపీ గౌష్‌‌‌‌‌‌‌‌ ఆలం

డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ రహిత సమాజం కోసం పాటుపడాలి :  సీపీ గౌష్‌‌‌‌‌‌‌‌ ఆలం
  •     సీపీ గౌష్‌‌‌‌‌‌‌‌ ఆలం

శంకరపట్నం, వెలుగు: డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కరీంనగర్ సీపీ గౌష్‌‌‌‌‌‌‌‌ ఆలం అన్నారు. సోమవారం శంకరపట్నం మండలం కేశవపట్నం పోలీసు శాఖ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌పై అవగాహన కార్యక్రమంలో భాగంగా వాలీబాల్ పోటీలు నిర్వహించగా.. విజేత జట్లకు బహుమతులు అందజేశారు. 

అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. విద్యార్థి దశ నుంచే క్రీడలు అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ మాధవి, ట్రైనీ ఐపీఎస్ సోహన్, సీఐ వెంకట్, ఎస్సై శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

కరీంనగర్ క్రైమ్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనరేట్ కేంద్రంలోని పోలీసులకు సంబంధించిన పలు కీలక కార్యాలయాలను సీపీ గౌష్‌‌‌‌‌‌‌‌ ఆలం తనిఖీ చేశారు. కార్యాలయాల నిర్వహణ, రికార్డుల నమోదు భద్రతా విభాగాల పనితీరును ఆయన  పర్యవేక్షించారు.​​ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏవో మునిరామయ్య, ఆర్ఐలు రజినీకాంత్, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.