యూరియా కొరత లేదు : కలెక్టర్ పింకేశ్ కుమార్

యూరియా కొరత లేదు : కలెక్టర్ పింకేశ్ కుమార్

జనగామ అర్బన్, వెలుగు :  జనగామ జిల్లాలో యూరియా కొరత లేదని ఇన్​చార్జి కలెక్టర్​ పింకేశ్​ కుమార్​ తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న అన్ని యూరియా పంపిణీ కేంద్రాలకు అవసరమైనంత స్టాక్​ అందుబాటులో ఉంచామన్నారు. సోమవారం ఆయన జనగామ మండలంలోని పీఏసీఎస్​ కేంద్రాలు, ఓబుల్​ కేశపూర్​లోని యూరియా సరఫరా పాయింట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా యూరియా, ఎరువుల లభ్యత, పంపిణీ పరిస్థితిపై ఆరా తీశారు.

 నిల్వలు, సరఫరా విధానం, రైతులకు పంపిణీ ప్రక్రియ, స్టాక్​ రిజిస్టర్ల నిర్వహణ, డిమాండ్​ సరఫరా సమతుల్యత వంటి అంశాలను సమగ్రంగా సమీక్షించారు. అంతకుముందు కలెక్టరేట్​లో గురుకులాల, వివిధ సొసైటీల రెసిడెన్షియల్​ స్కూళ్లలో బ్యాక్​లాగ్, కొత్త అడ్మిషన్లకు సంబంధించిన అర్హత పరీక్ష పోస్టర్​ను ఆయన అడిషనల్​ కలెక్టర్​ బెన్​షాలోమ్​తో కలిసి ఆవిష్కరించారు.​