మానుకోట లో పెరిగిన నేరాల సంఖ్య : ఎస్పీ శబరీశ్

మానుకోట లో పెరిగిన నేరాల సంఖ్య : ఎస్పీ శబరీశ్

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో గతంలో కంటే కేసుల నమోదు పెరిగినట్లు ఎస్పీ శబరీశ్​ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టౌన్​ పీఎస్​లో ఆయన క్రైమ్​వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 2024లో 4,327 కేసులు నమోదు కాగా, 2025లో 4,358 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. జిల్లాలో మర్డర్ కేసులు గతంలో 16నమోదు కాగా, ఈ ఏడాది 22 నమోదైనట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కేసులు గతంలో 61 ప్రస్తుతం 59 , ఘోర రోడ్డు ప్రమాదాలు గతేడాది 122, ప్రస్తుతం 125, రోడ్డు ప్రమాదాలు గతంలో 134,  ప్రస్తుతం 163 నమోదయ్యాయని పేర్కొన్నారు. 

పీడీఎస్ బియ్యం తరలింపు కేసులో గతంలో 98, ప్రస్తుతం 28 కేసులు నమోదు చేయగా, రూ.34,80,100 విలువైన బియ్యం సీజ్​ చేశామని, మిస్సింగ్​ కేసులు గతంలో 42 ప్రస్తుతం 55 నమోదయ్యాయని చెప్పారు. నల్ల బెల్లం తరలింపు సంబంధించి గతంలో 147, ప్రస్తుతం 155 కేసులు నమోదు చేసి రూ.4,65,14,650 విలువైన నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు, గుడుంబా తరలింపునకు సంబంధించి గతంలో 859 కేసులు కాగా, ప్రస్తుతం 79 కేసులు నమోదు  చేశామన్నారు.

 జిల్లాలో కేసుల ట్రయల్​లో గతంలో 69 మందికి శిక్షలు పడగా, ప్రస్తుతం 43 మందికి శిక్ష పడినట్లు వివరించారు. జిల్లాలో నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలను చేపట్టనున్నట్లు ఎస్పీ తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా, సైబర్​ క్రైమ్​లపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో, ఇతరులకు ఇబ్బందులు కలుగకుండా నిర్వహించుకోవాలని కోరారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్పీలు తిరుపతి​రావు, ఏఆర్​ డీఎస్పీలు శ్రీనివాస్, వర్టికల్​ డీఎస్పీ మోహన్, సీఐలు మహేందర్​ రెడ్డి, సర్వయ్య, సత్యనారాయణ, గణేశ్, ఉపేందర్​ పాల్గొన్నారు.