ఆదివాసీల చరిత్రను చాటి చెప్తాం : మైపతి అరుణ్‌‌కుమార్‌‌

ఆదివాసీల చరిత్రను చాటి చెప్తాం : మైపతి అరుణ్‌‌కుమార్‌‌

తాడ్వాయి, వెలుగు : ఇలవేల్పుల సమ్మేళనంతో ఆదివాసీల చరిత్రను చాటి చెబుతామని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్‌‌కుమార్‌‌ చెప్పారు. ఆదివాసీ సంఘాల జేఏసీ చైర్మన్‌‌ చుంచు రామకృష్ణ ఆధ్వర్యంలో 150 ఇలవేల్పుల తలపతుల బృందం సోమవారం మేడారంలో పర్యటించింది. అనంతరం ఐటీడీఏ క్యాంప్‌‌ ఆఫీస్‌‌లో తలపతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర సమయంలో మూడు రోజుల పాటు ఇలవేల్పుల పడగలు దేవర మూలాలతో మేడారం వస్తున్నట్లు తలపతుల ప్రతినిధులు తెలిపారు. 

ఆదిమ మూలం కోసం కృషి చేస్తున్న అరుణ్ కుమార్ ని 150 మంది తలపత్తుల బృందం గద్దెల ప్రాంగణంలో శాలవాతో సన్మానించారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ 15 ఏండ్లుగా తమ వేల్పుల దగ్గరకు వచ్చి అడిగి బొమ్మలు సేకరణ చేసి వాటిని శిల్పాలపై చెక్కే క్రమంలో చేస్తున్న ఇబ్బందులు అవాస్తవమని, అరుణ్​కుమార్​ వెనుత తామంతా ఉన్నామని గద్దెల సమక్షంలో హామీ ఇచ్చారు. 

మేడారం ఆలయంలో రాతి స్తంభాలపై చెక్కిన బొమ్మలు అన్ని పడగలు ఉన్న కోయ తాళపత్ర బొమ్మలన్నారు. జాతర విజయవంతం కోసం ఆలయ పునర్మాణం విజయవంతానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పూజారులు, ఎండోమెంట్ ఈవో వీరేశం, ఎండోమెంట్ సిబ్బంది, అరుణ్ కుమార్ బృందం తదితరులున్నారు.