డిగ్రీ అర్హతతో నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్..

డిగ్రీ అర్హతతో నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్..

సీఎస్ఐఆర్ నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (CSIR NIO) అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ, బీఎస్సీ, డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు వాక్- ఇన్‌‌ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. 2026, జనవరి 08న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 

ఖాళీలు: 14 (అప్రెంటీస్).

విభాగాల వారీగా ఖాళీలు
డిప్లొమా ట్రేడ్:  సివిల్ ఇంజినీరింగ్ 01, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 01, కంప్యూటర్ ఇంజినీరింగ్ 01, రిఫ్రిజిరేటర్ అండ్ ఏయిర్ కండిషనింగ్ ఇంజినీరింగ్ 01. 

గ్రాడ్యుయేట్ ట్రేడ్: నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ (ఓషనోగ్రఫీ) 07, నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్) 03. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/  కళాశాల నుంచి సంబంధిత ఇంజినీరింగ్‌‌ విభాగంలో మూడేళ్ల డిప్లొమా లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. ఏదైనా సైన్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ / ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 26 ఏండ్ల మధ్యలో ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ: 2026, జనవరి 08. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు www.nio.res.in వెబ్​సైట్​ను సందర్శించండి.