ప్రసార భారతిలో ఉద్యోగాలు.. జీతం 30వేలు.. జర్నలిజం చేసిన వారికి అవకాశం..

ప్రసార భారతిలో ఉద్యోగాలు.. జీతం 30వేలు..  జర్నలిజం చేసిన వారికి అవకాశం..

ప్రసార భారతి కాపీ రైటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. అప్లికేషన్లకు చివరి తేదీ  జనవరి 09. 

పోస్టులు: 05.

విభాగాల వారీగా ఖాళీలు: కాపీ ఎడిటర్ 03, కాపీ రైటర్ 02. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుంచి జర్నలిజం / మాస్ కమ్యూనికేషన్/ సంబంధిత రంగంలో డిగ్రీ / పీజీ  డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. హిందీ భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం ఐదేండ్ల అనుభవం ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 40 ఏండ్లు. 

అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 26.

లాస్ట్ డేట్: 2026, జనవరి 09. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, రాత పరీక్ష  లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు prasarbharati.gov.in వెబ్​సైట్​ను సందర్శించండి.