దివ్యాంగులు స్ఫూర్తిదాయకంగా నిలవాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

దివ్యాంగులు స్ఫూర్తిదాయకంగా నిలవాలి :  కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, వెలుగు: దివ్యాంగులు పట్టుదలతో లక్ష్యాలను సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్​ ఆదర్శ్​ సురభి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ దివ్యాంగులకు పట్టుదల, స్ఫూర్తి ఉంటుందని దీంతో సకలాంగులతో సమానంగా అన్నిరంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. 

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి వచ్చే నెలలో ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తామని తెలిపారు. దివ్యాంగుల కమిటీ సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లా సమాఖ్య సభ్యులను కలెక్టర్  శాలువా, మెమొంటోతో సత్కరించారు. ఆటల పోటీల్లో గెలుపొందిన దివ్యాంగులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. 

అంధులకు ప్రత్యేకంగా స్కూల్​ ఏర్పాటు చేయాలని, అర్హులైన  వారికి  సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని, ప్రతి మూడు నెలలకోసారి దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి రివ్యూ మీటింగ్​ నిర్వహించాలని దివ్యాంగుల కమిటీ ప్రతినిధులు మోహన్, మధు కోరారు. డీడబ్ల్యూవో సుధారాణి, అడిషనల్  డీఆర్డీవో సరోజ, మానసిక వైద్యురాలు పుష్ప పాల్గొన్నారు. 

రైతులకు అవసరమైన యూరియా ఉంది..

జిల్లాలోని రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్  ఆదర్శ్  సురభి తెలిపారు. సోమవారం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో యూరియా విక్రయ కేంద్రాల నుంచి ప్రతి రోజు ఎంత యూరియా నిల్వలపై నివేదిక అందజేయాలని ఆదేశించారు. యూరియా పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.  ఇన్​చార్జి డీఏవో దామోదర్, జిల్లా ఉద్యానవన శాఖాధికారి విజయభాస్కర్ రెడ్డి, డీసీవో రాణి పాల్గొన్నారు.