హైదరాబాద్, వెలుగు: పీసీసీ ఆదివాసీ చైర్మన్ గా నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ మేరకు సోమవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
చైర్మన్ గా శంకర్ నాయక్ తో పాటు మరో నలుగురు పునెం చంద్ర కళ, విస్లావత్ లింగం నాయక్, సెడ్మకి ఆనంద రావు, కురాకుల మల్లికార్జున్ లను వైస్ చైర్మన్లుగా నియమించారు.
