మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: మహబూబ్ నగర్ రాంరెడ్డి లయన్స్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ జనవరి 2 నుంచి 30 వరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విజయకుమార్ రెడ్డి తెలిపారు.
2న కోస్గి మండలంలో, 5న మక్తల్, 6న మాగనూరు, అచ్చంపేట,7న ఆత్మకూరు, 8న నాగర్ కర్నూల్,9న మహబూబ్ నగర్, 19న ఆమన్ గల్, 20న ధన్వాడ మండలం కొండాపూర్ లో నిర్వహిస్తున్నట్ల చెప్పారు.
21న కల్వకుర్తి,22 కృష్ణ మండలం గూడెబల్లూర్ లో, 23న మహబూబ్ నగర్, 23న ధన్వాడ, 27న అయిజ, 28న కృష్ణ మండలం కున్సి గ్రామంలో, 29న శాంతినగర్, పెబ్బేరు, 30న నాగర్ కర్నూల్ పట్టణంలో క్యాంప్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
