సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి : సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్సై రవిప్రకాశ్

సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి : సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్సై రవిప్రకాశ్

​వనపర్తి, వెలుగు: సైబర్  నేరగాళ్లు రోజురోజుకు కొత్త తరహాలో ప్రజలను మోసం చేస్తున్నారని, ముందుగా పోలీసులు ఆ నేరాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని సైబర్​ సెక్యూరిటీ బ్యూరో ఎస్సై రవిప్రకాశ్​ కోరారు. సోమవారం జిల్లా పోలీస్​ కార్యాలయం మీటింగ్​ హాల్​లో ‘ఫ్రాడ్  కా ఫుల్ స్టాప్’ కార్యక్రమంలో భాగంగా ‘నా లాగిన్, నా నియమం’ అనే థీమ్‌‌‌‌తో సైబర్  నేరాలపై అవగాహన కల్పించారు. ప్రతి లాగిన్  వ్యక్తిగత భద్రతతో ముడిపడి ఉందని, ఓటీపీ, పాస్‌‌‌‌వర్డ్  ఎవరికీ చెప్పకపోవడమే సైబర్  భద్రతకు మొదటి అడుగుగా పేర్కొన్నారు.

 అనుమానాస్పద కాల్స్, లింక్‌‌‌‌లకు దూరంగా ఉండాలని, బ్యాంక్/ కస్టమర్  కేర్  పేరుతో వచ్చే కాల్స్‌‌‌‌ను నమ్మవద్దని సూచించారు. సైబర్  మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌‌‌‌కు కాల్ చేయాలని లేదంటే cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు. టీజీసీఎస్బీ రూపొందించిన సైబర్  అవగాహన పోస్టర్లను ప్రదర్శించి పలు అంశాలను వివరించారు. జిల్లాలోని పోలీసు సిబ్బంది, జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది, సైబర్  పోలీసులు ఉన్నారు.