చెక్కులపై సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకాలు తప్పనిసరి : గ్రామీణాభివృద్ధి శాఖల డైరెక్టర్ సృజన

చెక్కులపై సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకాలు తప్పనిసరి : గ్రామీణాభివృద్ధి శాఖల డైరెక్టర్ సృజన
  •     పీఆర్, ఆర్డీ డైరెక్టర్​ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ నిధుల వినియోగం, చెక్కుల జారీపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల డైరెక్టర్ సృజన సోమవారం కీలక ఆదేశాలిచ్చారు. ఇకపై పంచాయతీ చెక్కులపై సర్పంచ్, ఉపసర్పంచ్ ఇద్దరి సంతకాలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.  పంచాయతీ నిధుల కోసం ఇచ్చే చెక్కులపై సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకాలు ఉంటేనే చెల్లుబాటవుతాయన్నారు. 

ఈ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఇద్దరి సంతకాలున్న చెక్కులను మాత్రమే ఆమోదించాలని, లేదంటే తిరస్కరించాలని ట్రెజరీ డైరెక్టర్‌కు తెలియజేశారు.