మంత్రి శ్రీధర్ బాబును కలిసిన సింగరేణి ల్యాండ్ లూజర్స్

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన సింగరేణి ల్యాండ్ లూజర్స్

బషీర్​బాగ్, వెలుగు : సింగరేణి ల్యాండ్ లూజర్స్ అసోసియేషన్ సభ్యులు సోమవారం హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్​సభ్యులు మాట్లాడుతూ 2013లో హైకోర్టులో గెలిచిన కేసు ఆదేశాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని, సెక్రటేరియట్‌‌లోకి కూడా అనుమతించలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హైకోర్టు ఆదేశాలు అమలవుతాయన్న నమ్మకం ఉందని, ఆ దిశగా ప్రయత్నించాలని మంత్రిని కోరినట్లు వివరించారు.