ఎప్ సెట్ కన్వీనర్ గా విజయ్కుమార్ రెడ్డి

ఎప్ సెట్ కన్వీనర్ గా విజయ్కుమార్ రెడ్డి
  • టీజీ సెట్స్-2026 కన్వీనర్ల నియామకం..
  • ఈసెట్, లాసెట్ బాధ్యత ఉస్మానియాకే 
  • ఉత్తర్వులు జారీచేసిన హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ 

హైదరాబాద్, వెలుగు:  వచ్చే విద్యా సంవత్సరం (2026–27) వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్టుల (టీజీ సెట్స్–2026)కు తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్ఈ) కన్వీనర్లను నియమించింది. ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ ప్రవేశపరీక్ష టీజీ ఎప్ సెట్ కన్వీనర్​గా జేఎన్టీయూహెచ్​మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్, వర్సిటీ రెక్టార్ కె.విజయ్​కుమార్ రెడ్డిని నియమించారు. 

గతంలో ఆయన ఎప్ సెట్ కో కన్వీనర్​గా, ఈసెట్ కన్వీనర్​గా బాధ్యతలు నిర్వహించారు. అయితే, సోమవారం సెట్స్ కన్వీనర్ల పేర్లను, నిర్వహించే వర్సిటీ పేర్లను టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ ఉత్తర్వులు జారీ చేశారు. వర్సిటీల వీసీలతో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. ఎప్​సెట్, పీజీఈసెట్ నిర్వహణ బాధ్యతలను జేఎన్టీయూకు, ఈసెట్, లాసెట్ బాధ్యతలను ఓయూకు అప్పగించారు. ఐసెట్​ను ఎంజీయూకు, ఎడ్ సెట్ ను కాకతీయ వర్సిటీకి, పీఈ సెట్ నిర్వహణను శాతవాహన వర్సిటీకి ఇచ్చారు.  

కన్వీనర్లు వీరే.. సెట్     కన్వీనర్ 

టీజీ ఎప్ సెట్:    ప్రొఫెసర్ కె.విజయ్​కుమార్ రెడ్డి 
టీజీ ఎడ్ సెట్:     ప్రొఫెసర్ బి.వెంకట్రామ్ రెడ్డి 
టీజీ  ఐసెట్:    ప్రొఫెసర్ అలువాల రవి 
టీజీ ఈసెట్:    ప్రొఫెసర్ పి. చంద్రశేఖర్ 
టీజీ లాసెట్, పీజీఎల్​సెట్:    ప్రొఫెసర్ బి. విజయలక్ష్మి 
టీజీ పీజీ ఈసెట్:    ప్రొఫెసర్ కె. వెంకటేశ్వర రావు 
టీజీ పీఈసెట్:    ప్రొఫెసర్ రాజేశ్ కుమార్