హైదరాబాద్, వెలుగు: బీసీ రచయితల వేదిక మహాసభలను విజయవంతం చేయాలని కన్వీనర్ జూకంటి జగన్నాథం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్లకు సానుకూలంగా కనిపించినా.. వాటికి వేర్వేరు ఎజెండాలు ఉన్నాయన్నారు. బీసీ రిజర్వేషన్ల రూపానికి, సారానికి మధ్య వైరుధ్యాలు ఉన్నాయని చెప్పారు.
నాయకుల పొంతనలేని మాటలతో బీసీలు గందరగోళానికి గురవుతున్నారని పేర్కొన్నారు. బీసీ రచయితల మహాసభ స్థలం, తేదీలు, సమావేశ వివరాలు త్వరలో తెలియజేస్తామని వెల్లడించారు. వివిధ జిల్లాల్లో ఉన్న బీసీ కవులు, రచయితలంతా తమ వివరాలను ఆయా జిల్లాల కో కన్వీనర్లకు తెలియజేయాలని కోరారు.
