- 12 జోన్లు, 60 సర్కిళ్లకు సీపీ, ఏసీపీ, టీపీఓల నియామకాలు
- 21 మంది మెడికల్ ఆఫీసర్లకు బాధ్యతలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్‌ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున టౌన్ ప్లానింగ్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ల ట్రాన్స్‌ఫర్లు, కొత్తగా ఏర్పడిన సర్కిళ్లకు అధికారుల నియమిస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ విస్తరణతో 12 జోన్లు, 60 సర్కిళ్లకు టౌన్ ప్లానింగ్ విభాగంలో సీపీ, ఏసీపీ, టీపీఓలను నియమించారు.అలాగే 21 మంది మెడికల్ ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించారు. ఇందులో కొందరు అదే సర్కిల్లో ఇదివరకు పని చేస్తూ ఉండగా ఇంకొందరు ఇతర సర్కిళ్లకు బదిలీ చేశారు.
