ముంబైలో పాదాచారుల పైకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి

ముంబైలో పాదాచారుల పైకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి

ముంబై: ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి భాండుప్ ఏరియాలో పాదాచారుల పైకి బస్సు దూసుకెళ్లింది. దీంతో నలుగురు స్పాట్ లోనే మృత్యువాత పడ్డారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. భాండుప్ – ముంబై మధ్య తిరిగి బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై, ట్రాన్స్ పోర్ట్ (బెస్ట్) కు చెందిన బస్ ఈ ప్రమాదానికి కారణమైంది.

నిత్యం రద్దీగా ఉండే భాండుప్ స్టేషన్ రోడ్ లో బస్సును రివర్స్ చేస్తుండగా ఈ ఘోరం చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రులకు తరలించగా.. వారిని పరీక్షించిన వైద్యులు ‘బ్రాట్ డెడ్’ గా నిర్ధారించారు. మరణించిన వారిలో ముగ్గురు మహిళలు, ఒక వ్యక్తి ఉన్నారని పోలీసులు తెలిపారు. మిగతా తొమ్మిది మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని చెప్పారు. నిర్లక్ష్యంగా బస్సు నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.