
హైదరాబాద్, వెలుగు: వర్క్‌స్పేస్ ప్రొవైడర్ ఆల్ట్ డాట్ ఎఫ్ కోవర్కింగ్ తన విస్తరణ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో తమ మొదటి కేంద్రాన్ని ప్రారంభించింది. 2025 చివరి నాటికి హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో మరో కేంద్రం ప్రారంభించడంతో సహా మరో మూడు కేంద్రాలను ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ప్రకటించింది.
ఈ కొత్త కేంద్రం 56వేల చదరపు అడుగుల మేర విస్తరించింది. ఇందులో 1,200 మంది ఉద్యోగులు పనిచేయవచ్చు. ఇక్కడ ప్రైవేట్ ఆఫీసులు, ఓపెన్ సీటింగ్, మీటింగ్రూమ్స్ , వర్చువల్ ఆఫీస్ సొల్యూషన్ల వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఆల్ట్ డాట్ ఎఫ్ కో–వర్కింగ్ ఇప్పటికే ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌లలో ఆఫీసులను నిర్వహిస్తోంది.