సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట పట్టణంలోని చైతన్య భారతి జూనియర్ కళాశాలకు చెందిన1991–93 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. 33 ఏండ్ల తర్వాత చిన్ననాటి మిత్రులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేవు.
తరగతి గదిలో చేసిన అల్లరిని గుర్తు చేసుకొని నవ్వుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. అధ్యాపకులు యాదగిరి, వెంకట్ రెడ్డి, సోమశేఖర్, రామ్మోహన్రావు, ప్రమీల, పూర్వ విద్యార్థులు మల్లారెడ్డి, శరత్, శ్యాంసుందర్, రుక్మారెడ్డి, భద్రారెడ్డి, శాస్త్రి, సురేందర్ రెడ్డి, శేష్మణి, గోదాదేవి, గీత, విజిత తదితరులున్నారు.
రామకృష్ణ డిగ్రీ కళాశాలలో..
హాలియా, వెలుగు: హాలియా పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలకు చెందిన 2000--–03 బ్యాచ్ బీఎస్సీ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకున్నారు. 23 ఏండ్ల తర్వాత కలిసిన తమ స్నేహితులను ఆప్యాయంగా పలకరించారు. చదువుకున్న రోజులను, చేసిన అల్లరిని గుర్తు చేసుకొని నవ్వుకున్నారు.
తమకు విద్యాబుద్ధులు నేర్పిన లెక్చరర్లను సత్కరించారు. ప్రిన్సిపాల్ లక్ష్మారెడ్డి, లెక్చరర్లు బాలకృష్ణ, శీనుబాబు, రవీందర్, నాగిరెడ్డి, అమరేందర్, విజయ్, సత్యనారాయణ, సోమిరెడ్డి, పూర్వ విద్యార్థులు డాక్టర్శంకర్, సైదులు, జనార్ధన్ రెడ్డి, నాగేశ్వరరావు, నాగరాజు, శ్రీను, సరిత, జానకమ్మ, సంతోషి, వసంత తదితరులు పాల్గొన్నారు.
