
సంక్రాంతి పండగను సంతోషంగా జరుపుకుంటున్న హైదరాబాద్ నగర జనాల్లో తీవ్ర విషాదాలను నింపుతున్నాయి పతంగులు. పంతగులు ఎగరవేస్తు గత రెండు రోజుల్లోనే ఐదుగురు మృతి చెందడం ఆందోళన కల్గిస్తోంది. జనవరి 14వ తేదీ ఆదివారం కూడా కుత్బుల్లాపూర్ పెట్ బషీరాబాద్ పరిధిలో ఓ డిగ్రీ విద్యార్థి పతంగికి బలయ్యాడు.
అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ASI గా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ రెండవ కుమారుడు అకాశ్(20) లయోలా కళాశాలలో డిగ్రీ మూడవ సంవత్సంర చదువుతున్నాడు. ఆదివారం భోగీ పండగ సందర్భంగా వారు నివసిస్తున్న పెట్ బషీరాబాద్, NCL కాలనీలోని అపార్ట్ మెంట్ భవనం పైకి ఎక్కి ఆకాశ్ గాలిపటం ఎగరవేస్తూ ప్రమాదవశాత్తు కాలి జారీ కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆకాశ్ ను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. పండుగ రోజు కుమారుడు మృతి చెందడంతో ASI కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.