నాకు తెల్వదు.. యాదికి లేదు ..పేమెంట్ గేట్ వే ఐడీలు చెప్పని ఐబొమ్మ రవి

నాకు తెల్వదు.. యాదికి లేదు ..పేమెంట్ గేట్ వే ఐడీలు చెప్పని ఐబొమ్మ రవి
  • ట్రాన్సాక్షన్స్ కోసం 7 ఇంటర్నేషనల్​ పేమెంట్ గేట్​వేస్
  • కరోనా టైమ్​లో రూ.13.40 కోట్లు ఖాతాలోకి
  • 12 రోజుల కస్టడీలో ఆర్థిక లావాదేవీలపై పోలీసులు ఆరా

పైరసీ, బెట్టింగ్ యాప్స్‌ ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్‌కు సంబంధించి పేమెంట్‌ గేట్‌వేల ఐడీలు మర్చిపోయినట్లు ఐబొమ్మ రవి పోలీసులకు చెప్పాడు. గుర్తుకు వచ్చినప్పుడు సహకరిస్తానని తెలిపాడు. ఈ మేరకు 12 రోజుల కస్టడీలో ఐబొమ్మ వెబ్‌సైట్‌ వివరాలను వెల్లడించాడు.

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఐబొమ్మ ఇమంది రవి పైరసీ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. పైరసీ, బెట్టింగ్ యాప్స్‌‌‌‌‌‌‌‌ ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి పేమెంట్‌‌‌‌‌‌‌‌ గేట్‌‌‌‌‌‌‌‌వేల ఐడీలు మర్చిపోయినట్లు రవి పోలీసులకు చెప్పాడు. గుర్తుకు వచ్చినప్పుడు సహకరిస్తానని తెలిపాడు. ఈ మేరకు 12 రోజుల కస్టడీలో ఐబొమ్మ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ వివరాలను వెల్లడించాడు. 

2007లో అమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేటలో కంప్యూటర్ కోచింగ్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్న సమయంలో రవి తన రూమ్‌‌‌‌‌‌‌‌మేట్ ప్రహ్లాద్ కుమార్ వెల్లాల ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌సీ మెమో ఫొటోకాపీని దొంగిలించాడు. నకిలీ పత్రాలు క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఫోర్జరీ పత్రాలతో ముంబైలోని ఇక్‌‌‌‌‌‌‌‌ఫాయ్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీలో ఎంబీఏ చదివాడు. ఆ తర్వాత తన ఫొటోతో ప్రహ్లాద్ కుమార్ వెల్లాల పేరున డ్రైవింగ్ లైసెన్స్ పొందాడు. ఆ డ్రైవింగ్ లైసెన్స్‌‌‌‌‌‌‌‌ను ఉపయోగించి, పాన్ కార్డు సంపాదించాడు. అదే పేరున బజాజ్ పల్సర్ కొన్నాడు. ఈ క్రమంలోనే ప్రహ్లాద్ కుమార్ వెల్లాల పేరుతో 4 బ్యాంకు అకౌంట్లను ఓపెన్ చేశాడు. 


పైరసీ సినిమాలు కొనుగోలు చేసి హెచ్‌‌‌‌‌‌‌‌డీ ప్రింట్లుగా టెలిగ్రామ్‌‌‌‌‌‌‌‌ ఛానెళ్ల ద్వారా కొనుగోలు చేసిన కొత్త సినిమాలను హెచ్‌‌‌‌‌‌‌‌డీ ప్రింట్లుగా పైరసీ చేసేవాడు. ఇందుకుగాను ఉషా ముళ్లపూడి హాస్పిటల్ రోడ్‌‌‌‌‌‌‌‌లో సుమారు 5 నుంచి 10 మందిని నియమించుకుని వైబ్‌‌‌‌‌‌‌‌సైట్లు నిర్వహించాడు. 

పైరసీ  సినిమాలను హోస్ట్ చేయడానికి గెట్టింగ్‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌ అనే సంస్థ ఎండ్ -టు- ఎండ్ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ వినియోగించాడు. కొత్తగా విడుదలైన సినిమాలను టెలిగ్రామ్ చానెల్స్ ద్వారా కొనుగోలు చేయడం, క్యామ్‌‌‌‌‌‌‌‌ కార్డర్ వెర్షన్‌‌‌‌‌‌‌‌ల కోసం సుమారు 100 యూఎస్‌‌‌‌‌‌‌‌ డాలర్లు, హై డెఫినిషన్ (హెచ్‌‌‌‌‌‌‌‌డీ) ప్రింట్ల కోసం 150 నుంచి 200 యూఎస్‌‌‌‌‌‌‌‌ డాలర్ల వరకు చెల్లించేవాడు. 

ఇందుకు సంబంధించి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ట్రాన్సాక్షన్ల కోసం పేపాల్, బిట్‌‌‌‌‌‌‌‌కాయిన్, కాయిన్‌‌‌‌‌‌‌‌బేస్, పేయర్, రోబోకాస్సా, క్యాపిటలిస్ట్, పర్ఫెక్ట్ మనీ వంటి ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ పేమెంట్‌‌‌‌‌‌‌‌ గేట్‌‌‌‌‌‌‌‌వేలు వినియోగించినట్లు తెలిసింది. కాగా, ఆయా గేట్‌‌‌‌‌‌‌‌వేలకు సంబంధించిన లాగిన్‌‌‌‌‌‌‌‌ ఐడీలు తనకు గుర్తుకు లేవని రవి పోలీసులకు తెలిపాడు. 

కరోనా టైమ్​లో సుమారు రూ.13.40 కోట్లు సంపాదించగా.. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ బెట్టింగ్ అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ల్‌‌‌‌‌‌‌‌లో ప్రకటనల ద్వారా సుమారు రూ.1.58 కోట్లు వచ్చినట్లు ఆధారాలు సేకరించారు. ఐబొమ్మ, బప్పంటీవైలతో జరిగిన ఆర్థికలావాదేవీలపైనే సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి పెట్టారు.