
వర్క్..పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల ప్రముఖ కంపెనీలు వ్యవస్థాపకులు చేసిన 14 గంటల పనివిధానం మరోసారి చర్చనీయాంశమైంది. రోజుకు 16 గంటల పనిచేస్తే ఓ టెకీ పనిఒత్తిడిలో ‘‘తాను చనిపోతున్నానా?’’ అని గుబులుతో సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆఫీసుల్లో పని..పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ పై ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చజరుగుతోంది.
Am I really dying ?
by u/just_ibu_reads in IndianWorkplace
బెంగళూరుకు చెందిన ఓ ఉద్యోగి సోషల్ మీడియా ప్లాట్ ఫాం రెడ్డిట్ వేదికగా.. తన ఉద్యోగంలో ఎదుర్కొంటున్న కష్టాలు, ఆఫీసుల్లో అనుభవాలు, సమస్యలను పంచుకుంటూ ఓ పోస్ట్ షేర్ చేశారు. ఆ ఉద్యోగి తాను కార్పొరేట్ బానిసనంటూ తన కష్టాలను రెడ్డిట్ లో పంచుకున్నాడు.
చాలా ఉద్యోగుల మాదిరిగానే నేను కార్పొరేట్ బానిసను.. నా కెరీర్ ప్రారంభం నుంచి ఈ విష సంస్కృతిలో చిక్కుకున్నాను. ప్రస్తుత ఉద్యోగంలో మూడేళ్లుగా పనిచేస్తున్నాను. ‘‘రోజుకు 14 గంటలకు పైగా పనిచేస్తున్నాను.. నా నిద్ర షెడ్యూల్ పూర్తిగా చెదిరిపోయింది.. తరుచుగా తెల్లవారు జామున రెండు గంటలకు నిద్రపోతున్నానని’’ వాపోయాడు.ఇది శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటూ ఉద్యోగం తన ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుందో హైలైట్ చేశాడు.
నా కేరీర్ లో చాలా నేర్చుకున్నాను.. కానీ నాణేనికి రెండో వైపు చూస్తే భయం, బాధ రెండూ కలిగిస్తున్నాయి. నా వ్యక్తిగత జీవితం చాలా కోల్పోయాను. గత రెండున్నరేళ్లలో ఎక్కడికి ప్రయాణించలేదు. కనీసం బెంగళూరులోని నంది హిల్స్ కూడా వెళ్లలేదు.. నాగర్ల్ ఫ్రెండ్ ను కూడా నిర్లక్ష్యం చేశాను.. అయినప్పటికీ జీవితం స్థిరపడ్డాను అని తన కష్టాలను ఏకరువు పెట్టారు ఆ టెకీ.
వర్క్.. లైఫ్ బ్యాలెన్స్ ను త్యాగం చేసి ఓ మంచి కార్పొరేట్ ఉద్యోగిగా మారిన తర్వాత తాను పూర్తిగా అలసిపోయానని హైలైట్ చేశాడు. జీతం బాగా సంపాదించినప్పటికీ సంతోషం లేని చెప్పుకొచ్చాడు. ‘‘కొత్త అవకాశాలకోసం ప్రయత్నించడానికి కూడా ఓపిక లేదు.. నేను ఇప్పుడు ఏం చేయాలి.. నేను నిజంగానే చనిపోతున్నానా? ’’ అని రెడ్డిట్ లో తన బాధను షేర్ చేశాడు.
ఈ పోస్ట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఉద్యోగం మానేసి విశ్రాంతి తీసుకోవాలని చాలా మంది అతనికి సలహాలిచ్చారు. ‘‘ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి ’’అని మరికొందరు సలహా ఇచ్చారు.
‘‘నీకు విశ్రాంతి చాలా అవసరం నీ దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి నీకు ఇష్టమైన సినిమా చూడటం.. మీరు మిస్ అవుతున్న ఫ్రెండ్స్ ను కలవడం లేదా మీ కుటుంబంతో ఎంజాయ్ చేయడం వంటి యాక్టివిటీస్ చేయండి ’’అని సజెస్ట్ చేశారు.
మరో నెటిజన్ ఇలా స్పందించాడు.వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు.. మీరు 14 గంటలపని చేస్తున్నారంటే.. మేనేజ్ మెంట్ ఒత్తిడి అయి ఉండొచ్చు. ఉద్యోగం మారడం మంచిది..లేదా మీరు ఎందుకు అలా నిత్యం పనిఒత్తిడిలో ఉంటున్నారో ఓ సారి చెక్ చేసుకోవాలి..ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి.. మీ జీవన శైలి మార్చుకోకపోతే భవిషత్తుల్లో తీవ్ర ప్రభావం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మీ సీనియర్లు, తోటి ఉద్యోగులతో మాట్లాడటం, పనిలో సలహాలు తీసుకోవడం వంటివి చేయాలని.. ఆఫీసు వదిలాక మీ వ్యక్తిగత లైఫ్ పై దృష్టిపెట్టండి అని సలహా ఇచ్చారు.