తెలంగాణలో అమరరాజా రూ.9500 కోట్ల పెట్టుబడులు

తెలంగాణలో అమరరాజా రూ.9500 కోట్ల పెట్టుబడులు

వచ్చే పదేళ్లలో తెలంగాణలో 9500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నామని అమర్ రాజా సంస్థ ప్రకటించింది. కొత్త టెక్నాలజీతో బ్యాటరీల తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. అమర్ రాజా లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, అమర్ రాజా గ్రూప్ మధ్య ఎంవోయూ కుదిరింది. అమర్ రాజా గత 37 ఏండ్లుగా  సేవలందిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. పారిశ్రామిక వేత్తలకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. ఈవీ బ్యాటరీల తయారీలో దేశంలోనే ఇది పెద్ద యూనిట్ అని చెప్పారు. అమర్ రాజా కంపెనీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. 

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన గల్లా జయదేవ్ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. రూ.9,500 కోట్ల పెట్టుబడులతో16 GWH లిథియం ఫ్యాక్టరీ ని మహబూబ్ నగర్  దివిటిపల్లిలో ప్రారంభించంనుందని చెప్పారు. అమర్ రాజా విజన్ అద్భుతంగా ఉందని కితాబు నిచ్చారు. టైర్ -2 పట్టణాల్లో అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ముందుకెళ్తుందన్నారు. దీంతో గ్రామీణ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు. ఇప్పుడు హైదరాబాద్ ఎలక్ట్రికల్ వాహనాల హబ్ గా మారుతుందన్నారు.