హైదరాబాద్, వెలుగు: అమర రాజా గ్రూప్ వ్యవస్థాపకుడు గల్లా రామచంద్ర నాయుడికి మహాత్మ అవార్డు దక్కింది. సుస్థిరత, దాతృత్వం, కార్పొరేట్ సామాజిక బాధ్యత రంగాల్లో సేవలు అందించిన వారికి మహాత్మా అవార్డు ఇస్తారు.
ఐపీఎస్ అధికారి డాక్టర్ కిరణ్ బేడీ చేతుల మీదుగా రామచంద్ర ఈ అవార్డును అందుకున్నారు. మహాత్మా అవార్డుకు ఆదిత్య బిర్లా గ్రూప్ మద్దతు ఇస్తోంది. ఈ కార్యక్రమం ఢిల్లీలో రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ సమాధి విశ్రాంతి స్థలంలో జరిగింది.