గ్లోబల్ హెల్త్ డెస్టినేషన్‌గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త మెడికల్ టూరిజం పాలసీని ప్రవేశపెట్టనుంది. ఇందుకు అనుగుణంగా ఇటీవల నిర్వహించిన ‘గ్లోబల్ సమ్మిట్’లో కూడా కీలక నిర్ణయాలు తీసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. పేషెంట్ ఫ్రెండ్లీ సొల్యూషన్ కోసం విదేశాల నుంచి వైద్యం కోసం వచ్చే వారు విమానం ఎక్కిన నిమిషం నుంచి తిరిగి వెళ్లే వరకు అడుగడుగునా అండగా నిలిచేలా ప్రభుత్వం ‘సింగిల్ విండో డిజిటల్ ప్లాట్‌ఫామ్’ను అందుబాటులోకి తీసుకురానుంది.
ఇప్పటివరకు వేర్వేరు డిపార్ట్‌మెంట్లలో ఉన్న సేవలన్నిం టినీ ఒకే ప్లాట్‌ఫామ్ కిందికి తీసుకొస్తు న్న ప్రభుత్వం స్వయంగా క్రెడిబుల్ ఫెసిలిటేటర్‌గా వ్యవహరిస్తోంది. ఈ పోర్టల్‌లో పేషెంట్లు ఆన్‌లైన్‌లోనే తమకు కావాల్సిన చికిత్సకు, అవసరమైతే ఆపరేషన్‌కు ఏ ఆసుపత్రిలో ఎంత ఖర్చవుతుందో, ఎక్కడ మెరుగైన సౌకర్యాలు ఉన్నాయో పరిశీలించుకొని సేవలు వినియోగించుకోవచ్చు. డాక్టర్ల అపాయింట్‌మెంట్లు మొదలుకొని ఆసుపత్రులలో బెడ్ బుకింగ్ సౌకర్యం వంటి సేవలు ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) డేటా ప్రకారం 2024 సంవత్సరంలో సుమారు 50 లక్షల మంది మెడికల్ టూరిస్టులు భారత్‌కు రావడంతో దేశానికి 90 వేల కోట్ల రూపాయలు లబ్ది చేకూరింది. ఈ నేపథ్యంలో ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా వైద్య రంగం మార్కెట్‌లో 10 నుండి 15 శాతం వాటాను పొందాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏఐ సాంకేతిక ఆధారిత చాట్‌బాట్‌లు, మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ (అరబిక్, ఫ్రెంచ్ వంటివి)తో పేషెంట్ల సమస్యలను పరిష్కరిస్తారు.
స్టేట్ మెడికల్ టూరిజం సొసైటీ
మార్కెటింగ్ ప్రచారానికి ఫోకస్టేట్ మెడికల్ టూరిజం సొసైటీ పర్యవేక్షణలో ఈ ప్లాట్‌ఫామ్ నడుస్తుంది.
హైదరాబాద్ సమీపంలోని అనంతగిరి, నోక్కాపూర్, భద్రాచలం వంటి అటవీ ప్రాంతాల్లో యోగా, ఆయుర్వేదం, నేచరో థెరపీ వైద్యంతో కూడిన డిజిటల్ డిటాక్స్, స్ట్రెస్ రికవరీ ప్యాకేజీలు
రూపొందిస్తారు.
థాయిలాండ్, సింగపూర్ వంటి దేశాలు ఇలాంటి ఇంటిగ్రేటెడ్ మోడల్స్‌తో సక్సెస్ సాధించాయి. తెలంగాణ కూడా ఈ పంథాను అనుసరిస్తూ, టూరిస్ట్ స్పాట్‌లను మెడికల్ టూరిస్టులకు అనుగుణంగా అభివృద్ధి చేయనుంది.
చార్టర్ అగ్రిమెంట్
రేట్లపై పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ విదేశీయుల నుంచి ఇష్టమొచ్చిన రేట్లు వసూలు చేసే ఆసుపత్రులకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది. ‘మెడికల్ టూరిజం చార్టర్ అగ్రిమెంట్’ ప్రకారం వెరిఫైడ్ హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్లు, హోటల్స్ మాత్రమే ప్లాట్‌ఫామ్‌లో ఉంటాయి. స్టాండర్డ్ ప్రైస్ బ్రాకెట్స్‌లో ధరలను ముందస్తుగానే ప్రకటిస్తారు.
ఇందుకు ఉదాహరణగా హార్ట్ సర్జరీకి రూ.5 నుంచి 10 లక్షలు ఖర్చు అవుతాయని ఆన్‌లైన్‌లో పెట్టడాన్ని చెప్పుకోవచ్చు. ఈ విధానం జేసీఐ (జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్) ప్రమాణాలతో సమానంగా ఉంటుంది.
5 లక్షల ఉపాధి అవకాశాలు
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ టూరిజం పాలసీలో భాగంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ప్రోత్సాహకాలు అందించనుంది. ఈ పాలసీ ద్వారా ఆర్థిక, ఉపాధి ప్రయోజనాలు భారీగా ఉంటాయి. ఈ పాలసీతో తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
2030 నాటికి మెడికల్ టూరిజం ద్వారా రూ.50 వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం ఆశిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి, నిమ్స్, అపోలో, యశోదా వంటి ఆసుపత్రులు ఇప్పటికే అంతర్జాతీయంగా పేషెంట్లను ఆకర్షిస్తున్నాయి.
ఫోర్బ్స్ మ్యాగజైన్ వివరాల ప్రకారం భారత్‌లో చికిత్స ఖర్చు అమెరికాకు 10 శాతం, యూరప్‌కు 30 శాతం మాత్రమే. ఈ నేపథ్యంలో ఈ మార్గదర్శక పాలసీతో తెలంగాణ రాష్ట్రాన్ని మెడికల్ టూరిజంలో అగ్రగామిగా నిలబెట్టడమే కాకుండా, ఆర్థికంగానూ బలోపేతం కావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నూతన పాలసీని వేగంగా అమలు చేసి రాష్ట్రాన్ని ప్రపంచ మ్యాప్‌లో హైలైట్ చేయాలనే ఉద్దేశ్యంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది.
ప్రభుత్వం పెంచనున్న ఆరోగ్య బడ్జెట్
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలివారమే ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంచారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంగా ‘హెల్త్ విజన్ 2047’ ద్వారా ప్రజలకు ఆర్థిక భద్రతతో కూడిన వైద్యాన్ని అందిస్తామని గ్లోబల్ సమిట్‌లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు.
తెలంగాణలో సరాసరిన ప్రతి 10 వేల మందికి వైద్యులు, సిబ్బంది కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. మరోవైపు అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి 10 వేల మందికి 40 మందికి పైగా ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ రూ.30 వేల కోట్లను వెచ్చించి అంతర్జాతీయ ప్రమాణాలతో ఆరోగ్య తెలంగాణను సాకారం చేసేలా ప్రభుత్వం పథకాలను రూపొందించనుంది.
ప్రపంచ బ్యాంకు, ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు ద్వారా ఆసుపత్రుల్లో ఆధునిక సౌకర్యాలు కల్పించనుంది. ప్రస్తుతం 4 శాతంగా ఉన్న వైద్య రంగం కేటాయింపులను ప్రభుత్వం 2047 నాటికి 8 శాతానికి పెంచనుంది. ఆరోగ్య, ఫార్మా రంగాలకు పెద్ద పీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు చేపడతున్న చర్యలు ఆశాజనకంగా ఉన్నట్టు గ్లోబల్ సమిట్ సదస్సులో నిరూపితమైంది. పేదల ప్రజారోగ్యానికి కూడా పెద్దపీట వేస్తూ రాష్ట్రాన్ని ‘ఆరోగ్య తెలంగాణ’గా నిలబెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం.
- అమరవాజి నాగరాజు -
