ఏపీ రాజధాని తరలింపుపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

ఏపీ రాజధాని తరలింపుపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పుపై వస్తున్న ఉహాగానాలకు చెక్ పెట్టింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రాజధాని అమరావతిని మార్చబోమంటూ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. రాజధాని మార్చే ఉద్దేశం ఉందా? అంటూ టీడీపీ ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అలాంటి ఉద్దేశం లేదని మండలిలో ఆయన స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా చేసిన ‘సర్వే ఆఫ్‌ ఇండియా’ సంస్థ తన తప్పు దిద్దుకుంది. అమరావతిని గుర్తిస్తూ కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. ఇటీవల సర్వే ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన దేశ పటంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఉంది కానీ… రాజధానిని గుర్తించలేదు. అది కాస్తా వివాదాస్పదంగా మారింది. ఈ విషయాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ లోక్‌సభలో ప్రస్తావించారు. దీనిపై స్పందించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి సవరించిన మ్యాప్‌ను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. నవంబర్ 22న దేశ పటంలో అమరావతిని చేర్చుతూ సర్వే ఆఫ్‌ ఇండియా కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది.