హర హర మహాదేవ శంభో శంకర ... అమర్ నాథ్ యాత్ర ప్రారంభం..

హర హర మహాదేవ శంభో శంకర ... అమర్ నాథ్ యాత్ర ప్రారంభం..

భారత దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక యాత్రల్లో ఒకటైన అమర్‌నాథ్‌ యాత్ర (Amarnath Yatra)ప్రారంభమైంది. జమ్మూకాశ్మీర్ లోని  భగవతి నగర్  బేస్ క్యాంప్ నుంచి బుధవారం ( జులై 6) ఉదయం అమర్ నాథ్ యాత్రను లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా  జండా ఊపి ప్రారంభించారు.  అంతకుముందు యాత్రి నివాస్​లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.   యాత్రికులు 'హర్​ హర్​ మహాదేవ్​, బం బం భోలే' నినాదాలు చేశారు.

అమర్ నాథ్ యాత్ర భక్తి మాత్రమే కాదని .. దేశ ఐక్యతను కాపాడుతుందని... ఎల్ జీ సిన్హా అన్నారు.  ఈ యాత్ర వలన సోదరభావం పెరుగుపడుతుందన్నారు.  ఈ యాత్ర కోసం ఇప్పటికే అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు.  ఈ సంవత్సరం (2025)  పెద్ద మొత్తంలో రిజిస్ట్రేషన్లు వచ్చాయి.  మొన్నటి వరకు భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో.. యాత్రికులు ఇబ్బంది పడకుండా  అధికారులు చర్యలు తీసుకున్నారు. 

జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే.   ఈ యాత్రకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అమర్‌నాథ్ యాత్ర మార్గాన్ని నో ఫ్లైజోన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ యాత్ర బాల్తాల్, పహల్గామ్ మార్గాల ద్వారా ప్రారంభమై, ఆగస్టు 9న రక్షా బంధన్ రోజు ముగుస్తుంది. భద్రతా కారణాలతో జవాన్లతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. RFID ట్యాగ్‌ల ద్వారా యాత్రికుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు.