రెండో రోజు నిలిచిన అమర్​నాథ్​ యాత్ర

రెండో  రోజు నిలిచిన అమర్​నాథ్​ యాత్ర

జమ్మూ కశ్మీర్లో ప్రతికూల వాతావరణం కారణంగా బల్తాల్, పహల్గామ్ మార్గాల్లో అమర్‌నాథ్ యాత్ర వరుసగా రెండో  రోజు(జులై 8)న నిలిపివేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..  శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారిని మూసివేయడం వల్ల యాత్రికులకు ప్రయాణానికి అనుమతి నిరాకరించారు. పలు ప్రాంతాల్లో రోడ్లు కుంగిపోయిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. అందులోని  ఒకదానిలో, రహదారి  కొంత భాగం విరిగిపోయినట్లు కనిపిస్తుంది. 

భారీ వర్షాల కారణంగా బురద ఏర్పడి తెల్లవారుజామున రాంబన్ సమీపంలో జాతీయ రహదారిని తాకడంతో ట్రాఫిక్‌ను నిలిపివేశారు.  జూలై 1న యాత్ర ప్రారంభమైనప్పటి నుండి దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని పవిత్ర గుహ పుణ్యక్షేత్రంలో 80,000 మందికి పైగా యాత్రికులు పూజలు చేశారు.   ఈ  పుణ్యక్షేత్రానికి సంబంధించి 62 రోజుల వార్షిక తీర్థయాత్ర జులై 1న పహల్గామ్, బల్తాల్ జంట ట్రాక్‌ల నుంచి  ప్రారంభమైంది. యాత్ర ఆగస్టు 31తో ముగుస్తుంది.