హెల్ప్ లైన్ నంబర్లు ప్రకటించిన ఢిల్లీలోని తెలంగాణ భవన్

హెల్ప్ లైన్ నంబర్లు ప్రకటించిన ఢిల్లీలోని తెలంగాణ భవన్

అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలంగాణకు చెందిన యాత్రికుల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రత్యేక హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసింది. ఏదైనా సహాయం అవసరమైన వారు 011 23380556, 011 23380558 ఫోన్ నంబర్లకు కాల్ చేయాలని కోరింది. మరోవైపు అమర్‌‌‌‌నాథ్ యాత్రలో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షంతో అమర్నాథ్లో భారీ వరదలు సంభవించాయి. వేలాది మంది ఈ వరదల్లో చిక్కుకుని విలవిల్లాడారు. ఇప్పటివరకు 15వేల మందిని రక్షించగా..16 మంది మృతి చెందారు. 40మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఎన్డీఆర్‌‌ఎఫ్, ఎస్‌‌డీఆర్‌‌‌‌ఎఫ్, ఆర్మీ, ఐటీబీపీ బృందాలతో పాటు స్థానిక పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.