అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

రెండేళ్ల విరామం తర్వాత మొదలైన అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణ ప్రతికూలతల కారణంగా యాత్రను  నిలిపివేసినట్లుఅధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం పహల్గామ్ యాక్సిస్‌లోని నున్వాన్ బేస్ క్యాంపు వద్ద సుమారు 3,000 మంది యాత్రికులను దర్శనానికి అనుమతించలేదని అధికారులు వెల్లడించారు. కాశ్మీర్ లోయలో అర్థరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. రానున్న 36 గంటలపాటు వర్షం కురిసే అవకాశం ఉంది.  ఈ క్రమంలో యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వాతావరణ పరిస్థితులు మెరుగవ్వగానే యాత్ర తిరిగి ప్రారంభిస్తామని నిలిపివేసినట్లుఅధికారులు  స్పష్టం చేశారు. కాగా జూన్ 30న  మొదలైన ఈ యాత్రను  ఇప్పటివరకు 75,000 మంది యాత్రికులు సందర్శించుకున్నారు. రక్షా బంధన్ సందర్భంగా ఆగస్టు 11న ఈ యాత్ర ముగియనుంది. అటు కోవిడ్ మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాల్లో అమర్‌నాథ్ యాత్ర జరగలేదు.