
సత్తుపల్లి, వెలుగు : హైదరాబాద్ సఫిల్ గూడ డీఏవీ స్కూల్ లో ఈనెల 10,11 తేదీల్లో నిర్వహించిన డీఏవీ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకుచెందిన 20 పాఠశాల నుంచి 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బి.గంగారం లోని సాయి స్ఫూర్తి డీఏవీ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ సందర్భంగా స్కూల్ హెచ్ఎం తణుకు శేష సాయి విద్యార్థులను శనివావారం అభినందిచారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈసారి స్టేట్ లెవెల్ గేమ్స్ లో తమ స్కూల్ విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ పథకాలు సాధించి అగ్రగామిగా నిలిచారన్నారు. అండర్–14 విభాగంలో ఛెస్ కాంపిటీషన్ లో చెస్ టీమ్ ప్రథమ స్థానం, అండర్–19బాలుర విభాగంలో వాలీబాల్ లో ప్రథమ స్థానం, అండర్–19 బాలుర విభాగంలో డిస్కస్ త్రో జీకేజీ గౌతమ్ ప్రథమ స్థానం సాధించినట్లు చెప్పారు.
అండర్–17 విభాగంలో 100 మీటర్ల పరుగులో డి.సాయి విఘ్నేష్ ద్వితీయ, 200 మీటర్ల పరుగులో ఎస్.లోకేశ్తృతీయ, 400 మీటర్ల పరుగులో ఎల్.లిఖిల్ ద్వితీయ బహుమతి, 800 మీటర్ల పరుగులో కె.ఆశ్రిత తృతీయ బహుమతి, షార్ట్ పుట్ విభాగంలో వై.గౌరీప్రియ ప్రథమ బహుమతి, డిస్కస్ త్రో విభాగంలో వై.గౌరీప్రియ ప్రథమ బహుమతి సాధించినట్లు తెలిపారు. అండర్–14 విభాగంలో100 మీటర్ల పరుగులో ఎల్.మాన్విత ప్రథమ బహుమతి, 400 మీటర్ల పరుగులో కె. అక్షర ద్వితీయ బహుమతి, 800 మీటర్ల పరుగులో టి.నైనిష ప్రథమ బహుమతి, షార్ట్ పుట్ విభాగంలో సీహెచ్ ఉపేక్ష ప్రథమ బహుమతి సాధించారని వివరించారు.
అండర్–19 రన్నింగ్ విభాగంలో ఎ.రోహిత, ఎన్.కృష్ణధీరజ్, ఎస్.దీక్షిత్, లాంగ్ జంప్ విభాగంలో ఎ.రోహిత, అండర్–17 కరాటే విభాగంలో జి.కీర్తిశ్రీ, జి.శంకర్, బి.అభిరామ్, కబడ్డీ టీమ్, వాలీబాల్ టీమ్ లు నవంబర్ నెలలో ఢిల్లీ లో జరిగే డీఏవీ నేషనల్ గేమ్స్ కి సెలెక్ట్ అయ్యారని తెలిపారు. ప్రతి సంవత్సరం నిర్వహించే డీఏవీ స్కూల్స్ గేమ్స్ లో తమవిద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారని, చదువుతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
విజేతలతోపాటు శిక్షణ ఇచ్చిన పీడీ కె.కుమారస్వామి, పీఈటీలు ఎం.రామ్ శెట్టి, కే.వాసుదేవరావ్ ను సాయి స్ఫూర్తి హానరరీ చైర్మన్ డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, డీఏవీ తెలంగాణ జోన్- రీజనల్ ఆఫీసర్ జీఆర్కే ప్రసాద్, సాయి స్ఫూర్తి కాలేజ్ చైర్మన్ దాసరి ప్రభాకర్ రెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్టీ బండి అన్విద, సాయి స్ఫూర్తి కళాశాల ప్రిన్సిపాల్ శేష రత్న కుమారి అభినందించారు.