
రాజస్థాన్‌లో ఓ యువకుడు పెళ్లి దుస్తులతోనే 13 రోజులు పాటు వేచి ఉండాల్సి వచ్చింది. వరుడిగా అతడు ముస్తాబైన13 రోజుల తర్వాత అతనికి వివాహమైంది. మరి ఇన్ని రోజులు అతను ఎందుకు పెళ్లి బట్టల్లోనే ఉండాల్సి వచ్చింది అంటే.. అందుకు కారణం పెళ్లి కుమార్తె వేరొకరితో వెళ్ళిపోవడమే. ఆమెను వెతికి పట్టుకొచ్చి పెళ్లి చేసుకునేంతవరకు ఆ పెళ్ళి కుమారుడు పెళ్లి దుస్తుల్లోనే ఉన్నాడు. ఈ సంఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
రాజస్థాన్, సిరోహి ప్రాంతానికి చెందిన శ్రవణ్ కుమార్‌కు.. పాలీలోని సైనా గ్రామానికి చెందిన మనిషాతో పెద్దలు వివాహం నిశ్చయించారు. వారి పెళ్లి రోజు రానే వచ్చింది. వరుడు.. వధువు కోసం పెళ్లి పీటలపై వెయిట్ చేస్తున్నాడు. అదే సమయంలో బాత్రూంకి వెళ్లి వస్తానని చెప్పిన మనీష.. అక్కడినుండి తన తల్లి తరపు బంధువైన భరత్‌తో పారిపోయింది. పూజారి పెళ్లికూతురిని తీసుకురండి అని అడిగేంత వరకు మనిషా పారిపోయిన సంగతి ఎవరికీ తెలియదు.
పెళ్లి కుమార్తె కనిపించకపోవడంతో ఇరు కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించడం మొదలు పెట్టారు. ఎంతకూ ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు పిర్యాదుచేశారు. పిర్యాదు అందుకున్న పోలీసులు ఆమెను వెతికే పనిలో పడ్డారు. మనీషను తన కాబోయే భార్యను ఊహించుకున్న శ్రవణ్ కుమార్ ఆమెను వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఆమె ఆచూకీ తెలిసేవరకుఅత్తగారింట్లోనే ఉన్నాడు. అది కూడా పెళ్లి దుస్తుల్లోనే..
చివరకు మే 15న మనిషా బంధువులు ఆమెను గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత వారి వివాహం జరిగింది. పెళ్లి తంతు పూర్తవగానే దంపతులిద్దరూ శ్రవణ్ ఇంటికి వెళ్లారు. అయితే మనిషా ఎక్కడికి వెళ్ళింది? అన్ని రోజులు ఎక్కడ ఆశ్రయం పొందింది? భరత్‌తో ఆమెకున్న సంబంధం ఏంటి? అన్న విషయాలపై స్పష్టత లేదు. ఏదేమైనా 13 రోజులపాటు పెళ్లి దుస్తుల్లోనే ఉండి కాబోయే భార్య కోసం ఎదురుచూసిన వరుడి గురుంచి గొప్పగానే మాట్లాడుకుంటున్నారు. మరొకరితో వెళ్లిపోయిందంటే అవమానంగా భావించి తప్పించుకునే ఈరోజుల్లో.. ఈ పెళ్లికొడుకుపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.