
హైదరాబాద్, వెలుగు: జీఎస్టీ తగ్గినందున ఈసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా తెలంగాణ నుంచి స్మార్ట్‌ఫోన్లు, ప్రీమియం టీవీలు, ఫ్రిజ్లు, ఏసీలు, వాషింగ్మెషీన్లు భారీగా అమ్ముడయ్యే అవకాశాలు ఉన్నాయని అమెజాన్ పేర్కొంది. ఈ నెల 23న మొదలయ్యే ఈ సేల్కోసం అన్ని ఏర్పాట్లూ చేశామని సంస్థ సీనియర్ఎగ్జిక్యూటివ్ చెప్పారు. పెద్ద ఎత్తున సీజనల్ జాబ్స్ ఇచ్చామని అన్నారు.
‘‘తెలంగాణలో మాకు 57 వేల మందికి పైగా సెల్లర్లు ఉన్నారు. 18 వేల లోకల్ షాప్స్ ఉన్నాయి. మూడు ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, 500 కంటే ఎక్కువ డెలివరీ స్టేషన్లు ఉన్నాయి. కరీంనగర్, వరంగల్, నల్గొండ లాంటి టైర్-2 సిటీల్లోనూ డిమాండ్ ఉంది. కస్టమర్లు ఇప్పుడు అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, మెరుగైన పనితీరు ఉన్న ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు” అని అమెజాన్ ఇండియా డైరెక్టర్ జెబా ఖాన్ చెప్పారు.