
ప్రారంభించిన కేంద్ర మంత్రి షెకావత్
హైదరాబాద్, వెలుగు : ఢిల్లీలోని అమెజాన్ స్వచ్ఛతా స్టోర్‌ను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించారు. ఈ స్టోర్ ద్వారా లోకల్ సెల్లర్లు , ఎస్ఎంఈలు, తయారీదారులు నుంచి వాక్యూమ్ క్లీనర్స్, శానిటరీ వేర్, వాటర్ ప్యూరిఫైర్స్, మాప్స్ , చీపుళ్లు వంటి వస్తువును తక్కువ ధరలకే కొనొచ్చు. ఇందులో 20 వేలకిపైగా వస్తువులు ఉంటాయి. అంతేగాక పరిశుభ్రత వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి కూడా అవగాహన కలిగిస్తారు