
సెప్టెంబర్ 23న ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సేల్ తరువాత ఇప్పుడు దీపావళి స్పెషల్ అఫర్ సేల్ రాబోతుంది. సియాటిల్‌కు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ ఫెస్టివల్ సేల్ క్యాష్ చేసుకునేందుకు స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ఇయర్‌ఫోన్‌లు, స్పీకర్లు, స్మార్ట్‌వాచ్‌లు, హోమ్ అప్లియన్సెస్, ల్యాప్‌టాప్‌లతో సహా ఇతర ఎల్ట్రోనిక్స్ ఉత్పత్తులపై కళ్ళుచెదిరే అదిరిపోయే డిస్కౌంట్స్ అందిస్తుంది. అయితే మీరు కొత్తగా ల్యాప్‌టాప్ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్స్ కోసం మార్కెట్‌లో చూస్తున్నారా... ఇప్పుడు మీరు HP, డెల్, ఏసర్, ఆసుస్, లెనోవో సహా మరిన్ని బ్రాండ్‌ల బెస్ట్ అప్షన్స్ ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి.
ఈ సేల్ సమయంలో కస్టమర్లు డిస్కౌంట్ ధరతో బ్యాంక్ ఆఫర్స్ కూడా పొందొచ్చు. మీకు యాక్సిస్ బ్యాంక్, బరోడా బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, RBL బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఉంటే, మీరు మీ ప్రతి కొనుగోలు పై 10 శాతం వరకు అదనపు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా ఈ బెనిఫిట్ పొందవచ్చు.
Asus Vivobook S16 OLED (S3607CA) ల్యాప్‌టాప్ : ఈ ఆసుస్ ల్యాప్‌టాప్ అసలు ధర రూ.1,21,990. ప్రస్తుత డిస్కౌంట్ ధర రూ. 87,990. దీనికి 1920x1200 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 16-అంగుళాల డిస్ ప్లే ఉంది. దీనికి టచ్‌స్క్రీన్ సపోర్ట్ లేదు. కోర్ i7 ప్రాసెసర్‌తో 16GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది.
HP 15-FD1254TU ల్యాప్‌టాప్ : HP 15-FD1254TU ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 83,033, కానీ అమెజాన్ ఇండియాలో రూ.59,990 తక్కువ ధరకే లభిస్తుంది. దీనికి 15.60-అంగుళాల డిస్ ప్లే, విండోస్ OS, 16GB RAM, 512GB SSD స్టోరేజ్, ఇంటెల్ కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్ ఉంది.
ఏసర్ ఆస్పైర్ లైట్ ల్యాప్‌టాప్ : ఈ ఏసర్ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 80,999, కానీ అమెజాన్ డిస్కౌంట్ కింద రూ.57,990కే లభిస్తుంది, దీనిని EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు. 1920 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 15.6-అంగుళాల డిస్ ప్లే ఉంది. 16GB LPDDR5 SDRAM, 1TB స్టోరేజ్ సపోర్ట్ ఉంది.
*ఆసుస్ ఎస్14 ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 1,08,990, అయితే అమెజాన్ అందిస్తున్న డిస్కౌంట్ ధర రూ. 79,990.
*లెనోవో యోగా స్లిమ్ ల్యాప్‌టాప్ MRP ధర రూ. 1,13,290, కానీ మీరు దీనిని అమెజాన్ అఫర్ కింద రూ. 72,990కే కొనొచ్చు.
*డెల్ AI ల్యాప్‌టాప్ ధర రూ. 89,250, అయితే మీరు ఈ సేల్ లో దీపావళి డిస్కౌంట్ కింద రూ. 66,490కే కొనుగోలు చెయ్యొచ్చు.