
హైదరాబాద్, వెలుగు: అమెజాన్ఇండియా తన ఆన్లైన్కిరాణా సర్వీస్అమెజాన్ఫ్రెష్ను దేశవ్యాప్తంగా 270కి పైగా నగరాలకు విస్తరించనున్నట్లు ప్రకటించింది. కొత్తగా గోరఖ్పూర్, డెహ్రాడూన్, జలంధర్, కోయంబత్తూర్, నెల్లూరు, జంషెడ్పూర్, దుర్గాపూర్ వంటి పలు నగరాల్లో కిరాణా సరుకులను డెలివరీ చేస్తామని తెలిపింది.
"అమెజాన్ ఫ్రెష్ కేవలం రెండేళ్లలో 4.5 రెట్లు విస్తరించింది. మనదేశంలోని కుటుంబాలు ఆన్లైన్లో కిరాణా సామాగ్రిని కొనుగోలు చేసే విధానాన్ని మార్చింది. 270కి పైగా నగరాలకు విస్తరించడం ద్వారా, పండుగ రోజుల్లో అవసరమయ్యే వస్తువులను గతంలో కంటే ఎక్కువ కుటుంబాలకు అందుబాటులోకి తెస్తున్నాం’’ అని అమెజాన్ ఫ్రెష్ఇండియా డైరెక్టర్శ్రీకాంత్ తెలిపారు.