Amazon prime air : అమెజాన్.. ప్రైమ్ ఎయిర్ పేరిట కొత్త సర్వీస్

Amazon prime air : అమెజాన్.. ప్రైమ్ ఎయిర్ పేరిట కొత్త సర్వీస్

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. అమెజాన్ ప్రైమ్ ఎయిర్ సేవల్ని భారత్ లో ప్రారంభించింది. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ సేవల్ని ప్రారంభించారు. అమెజాన్ ప్రైమ్ ఎయిర్ సర్వీస్ లో భాగంగా వస్తువుల్ని త్వరగా డెలివరీ చేయడానికి కార్గో విమానాలను ఉపయోగించనున్నారు. 

ప్రైమ్ ఎయిర్ సర్వీసులు అందుబాటులోకి రావడంతో ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ సిటీల్లో వస్తువులు త్వరగా డెలివరీ చేసే వెసలుబాటు కలుగుతుంది. ఇందుకు బోయింగ్ 737 - 800 విమానాలు ఉపయోగించనున్నారు. ఇందుకోసం బెంగళూరుకు చెందిన క్విక్ జెట్ సంస్థతో అమెజాన్ అగ్రిమెంట్ చేసుకుంది. దేశంలో ఓ ఈ - కామర్స్ సంస్థ థర్డ్ పార్టీ విమాన సేవలు వినియోగించుకోవడం ఇదే తొలిసారి. అమెజాన్ ప్రైమ్ ఎయిర్ సేవలు తొలుత 2016లో అమెరికాలో ప్రారంభంకాగా.. ఆ తర్వాత యూకేకు విస్తరించాయి. ప్రస్తుతం భారత్ లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.