
అమెజాన్ తన ఇయర్ ప్లాగ్షిప్ఈమెంట్ లో కొత్త కొత్త డివైజ్‌లను విడుదల చేసింది. ఫైర్ టీవీ మోడల్‌లు ,రింగ్ సెక్యూరిటీ ఉత్పత్తులతో పాటు, జనరేటివ్ AIని ఉపయోగించే దాని వాయిస్ అసిస్టెంట్ అలెక్సా+ ఆధారిత కొత్త ఎకో పరికరాలను విడుదల చేసింది.
అమెజాన్ కొత్త ఎకో డివైజ్శ్రేణిని రిలీజ్ చేసింది. కొత్త స్పీకర్లు ,స్మార్ట్ డిస్ ప్లే లను పరిచయం చేసింది. ఇవన్నీ అలెక్సా+ తో వస్తున్నాయి. అదనంగా అమెజాన్ కొత్త కిండిల్ మోడల్‌ను ప్రారంభించింది.
అమెజాన్ కొత్త ఎకో లైనప్: కీ ఫీచర్స్, స్పెసిఫికేషన్లు, ధరలు
అమెజాన్ అలెక్సా+ (Alexa+) తో నడిచే నాలుగు కొత్త ఎకో (Echo) డివైజ్‌లు – ఎకో డాట్ మ్యాక్స్ (Echo Dot Max), ఎకో స్టూడియో (Echo Studio), ఎకో షో 8 (Echo Show 8), ఎకో షో 11 (Echo Show 11) డివైజ్ లను అమెజాన్ అందుబాటులోకి తెచ్చింది.
కీ ఫీచర్స్ & స్పెసిఫికేషన్లు..
కొత్త చిప్‌లు: తాజా ఎకో డివైజ్‌లలో కొత్త AI యాక్సిలరేటర్‌తో AZ3, AZ3 ప్రో చిప్‌లు వినియోగించారు.
AZ3: ఎకో డాట్ మ్యాక్స్
AZ3 ప్రో: ఎకో స్టూడియో, ఎకో షో 8, ఎకో షో 11
అలెక్సా+ లో కొత్త ఫీచర్లు
అలెక్సా వేక్-వర్డ్ ఐడెంటిఫికేషన్ను మెరుగుపరిచారు.
నాయిస్ క్యాన్సిలేషన్.
మెరుగైన ప్రాసెసింగ్ పవర్ ,మెమరీ.
డిజైన్ & ఆడియో:
చూడగానే ఆకట్టుకునే డిజైన్.
ఎకో డాట్ మ్యాక్స్: ఎకో డాట్ (5వ జనరేషన్) తో పోలిస్తే బాస్ దాదాపు 3 రెట్లు ఎక్కువ.
కొత్త ఎకో స్టూడియో: ఒరిజినల్ కంటే 40% చిన్నది.
డివైజ్ ధర (భారతీయ రూపాయలలో)
- ఎకో డాట్ మ్యాక్స్ రూ. 8,800
- ఎకో స్టూడియో రూ. 19,500
- ఎకో షో 8 రూ. 19,500
- ఎకో షో 11 రూ. 19,500