మొన్న ట్విట్టర్, నిన్న ఫేస్ బుక్.. నేడు అమెజాన్ !

మొన్న ట్విట్టర్, నిన్న ఫేస్ బుక్.. నేడు అమెజాన్ !

ఇటీవలి కాలంలో ఖర్చు తగ్గించుకునేందుకు చాలా కార్పొరేట్ సంస్థలు ఉద్యోగులను తీసివేస్తున్నాయి. ఈ క్షిష్ట పరిస్థితుల్లో అమెజాన్ కూడా ట్విట్టర్, ఫేస్ బుక్ బాటలోనే నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 10,000 మందిని ఉద్యోగం నుంచి తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్టు ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ కు 1.6మిలియన్ల మంది ఉద్యోగులుండగా.. అందులోనుంచి కొంత మంది రిమూవ్ చేసేందుకు ప్లాన్ చేస్తోందని తెలిపింది. నష్టాలను అధిగమించేందుకే అమెజాన్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందన్న న్యూయార్క్ టైమ్స్... అందులో భాగంగానే ఉద్యోగులను తొలగించనుందని వెల్లడించింది. అయితే ఈ ప్రక్రియ కూడా వచ్చే వారం రోజుల వ్యవధిలోనే జరగునున్నట్టు ప్రకటించింది. 

రిటైల్, మానవ వనరులు, అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌ విభాగం.. ఇలా అన్ని డిపార్ట్‌మెంట్లల్లోనూ ఉద్యోగాల్లో కోతలు ఉండొచ్చని అంచనా వేస్తోన్నట్లు తెలిపింది. దీనికి కారణాలు మాత్రం లేకపోలేదు. ప్రపంచవ్యాప్తంగా కొనుగోళ్లు తగ్గడం, ఆర్థికమాంద్య సూచనలు, అంచనాలకు అనుగుణంగా రాబడి లేకపోవడం వంటి కారణాల వల్లే అమెజాన్ యాజమాన్యం ఈ నిర్ణయాన్ని తీసుకుందని మరో మీడయా ది వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.