అమెజాన్ ప్రైమ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక నుంచి యాడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్.. ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే..!

అమెజాన్ ప్రైమ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక నుంచి యాడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్.. ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే..!

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ చూస్తుంటే స్కిప్ చేయడానికి కూడా వీలు లేని యాడ్స్ తో ఇబ్బంది పడుతున్నారా..? ఇక నుంచి ఎలాంటి యాడ్స్ చికాకు లేకుండా కంటిన్యూగా వీడియో ఎంజాయ్ చేసే సదుపాయం అమెజాన్ ప్రైమ్ తీసుకొచ్చింది. ఇండియాలో ఇక నుంచి యాడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ తీసుకొస్తున్నట్లు మంగళవారం (మే 13) ప్రకటించింది. 

కంటెంట్ ఇప్రూవ్ మెంట్ కోసం అమెజాన్ ఎప్పుడూ పెట్టుబడులను పెడుతూనే ఉంటుందని ఈ సందర్భంగా సంస్థ ప్రకటించింది. యాడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ 2025, జూన్ 17 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. 

యాడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ప్లాన్లు ఇలా ఉన్నాయి:

ఇప్పుడున్న ప్లాన్స్ కు యాడ్-ఆన్ ఆప్షన్ కింద  ఈ కొత్త ఫీచర్ ను తీసుకొస్తుంది ప్రైమ్. అందులో బాగంగా సంవత్సరానికి రూ.699 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే నెలకు ఇప్పుడున్న ప్లాన్స్ కు 129 రూపాయలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.  అప్పడు మాత్రమే యాడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ చూడవచ్చు. జూన్ 17 నుంచి లిమిటెడ్ యాడ్స్ తో వీడియోస్, మూవీస్, టీవీ షోస్ ఉంటాయని అధికారికంగా ప్రకటించింది. 

అమెజాన్ ప్రైమ్ లో ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా ఉంది. ఇది ఫోన్, టీవీ లో 720 పిక్సిల్ రెజొల్యూషన్ ప్లాన్. అయితే దీని గురించి మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.