బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సకు అమెజాన్ తేలు విషం.. కనుకొన్న బ్రెజిల్ సైంటిస్టులు

బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సకు అమెజాన్ తేలు విషం.. కనుకొన్న బ్రెజిల్ సైంటిస్టులు

రియో డ జనీరో: బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్ మెంట్‎లో అమెజాన్ తేలు విషం ఉపయోగపడవచ్చని బ్రెజిల్  సైంటిస్టులు కనుగొన్నారు. ఈ విషయం తమ అధ్యయనంలో తేలిందని, సైంటిఫిక్ డెవలప్​మెంట్‎లో ఇదొక ముందడుగని వారు తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్​ సావో పౌలోకు చెందిన పరిశోధకులు.. అమెజాన్  అడవుల్లో నివసించే ‘బ్రోతియస్  అమెజానికస్  స్కార్పియన్’ తేలు విషంలో ‘బామాజ్  ఎస్ సీపీఎల్ 1’ అనే మాలిక్యూల్​ను కనుగొన్నారు. క్యాన్సర్ కణాలను చంపడానికి ఉపయోగించే కీమోథెరపీ డ్రగ్ లాగే ఈ మాలిక్యూల్​ కూడా పనిచేస్తుందని గుర్తించారు.

‘‘మా అధ్యయనం కోసం తేలు నుంచి జన్యువులను సేకరించాం. దీనినే హెటిరోలోగస్ ఎక్స్​ప్రెషన్ అంటారు. ఆ జన్యువులను మరొక ఆర్గానిజంలో ప్రవేశపెట్టి కొత్త మాలిక్యూల్స్ సృష్టిస్తాం. ఈ ప్రక్రియ  ద్వారా సెరైన్  ప్రొటీస్​ను సృష్టించడమే మా పరిశోధన లక్ష్యం” అని అరాంటెస్  వివరించారు. మామూలు కణజాలాలను నాశనం చేయకుండానే క్యాన్సర్ కణాలపై దాడిచేసి వాటిని నాశనంచేసే లక్షణం అమెజాన్  తేలు విషంలో ఉన్నట్లు తమ పరిశోధనలో గుర్తించామని ఆమె పేర్కొన్నారు.