V6 News

భారత్‌లో భారీ పెట్టుబడి: 2030 నాటికి 3 లక్షల కోట్లు పెట్టనున్న అమెజాన్ ! కొత్తగా 10 లక్షల ఉద్యోగాలు...

 భారత్‌లో భారీ పెట్టుబడి: 2030 నాటికి 3 లక్షల కోట్లు పెట్టనున్న అమెజాన్ ! కొత్తగా 10 లక్షల ఉద్యోగాలు...

ఈ-కామర్స్ రంగంలో ప్రపంచ దిగ్గజమైన అమెజాన్ 2030 నాటికి ఇండియాలోని  వ్యాపారాలన్నింటిలో  సుమారు రూ. 31 లక్షల కోట్లకు పైగా భారీగా పెట్టుబడి పెట్టనుంది. AI (కృత్రిమ మేధస్సు) సహాయంతో డిజిటలైజేషన్, ఎగుమతులను పెంచడం అలాగే ఉద్యోగాలు సృష్టించడంపై ఈ పెట్టుబడి ఉంటుందని  ప్రకటించింది. 

 అమెజాన్ ప్రకటించిన ఈ రూ.31 లక్షల  కోట్ల  పెట్టుబడి ఇతర పోటీదారుల కంటే చాలా ఎక్కువ.  ఈ మొత్తం మైక్రోసాఫ్ట్  ప్రకటించిన 17 లక్షల కోట్ల పెట్టుబడి కంటే రెట్టింపు. అలాగే 2030 నాటికి గూగుల్ ప్రకటించిన 13 లక్షల కోట్ల పెట్టుబడి కంటే కూడా దాదాపు 2  రెట్లు ఎక్కువ. అమెజాన్ అధికారి ప్రకారం, అమెజాన్ ఇప్పటికే 2010 నుంచి భారతదేశంలో సుమారు రూ. 35 లక్షల కోట్లపెట్టుబడి పెట్టింది. ఈ కొత్త పెట్టుబడితో కలిపి మొత్తం 65 లక్షల కోట్ల పెట్టుబడితో భారతదేశంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుగా అమెజాన్ నిలుస్తుంది.

 అమెజాన్ 'సంభవ్‌ సమ్మిట్' సందర్భంగా కంపెనీ సీనియర్ VP అమిత్ అగర్వాల్ ఈ విషయాలను వెల్లడించారు. భారతదేశం నుండి ఇప్పటివరకు జరిగిన దాదాపు  2 వేల కోట్ల ఎగుమతులను నాలుగు రెట్లు పెంచి 8 వేల కోట్లకు చేర్చాలని ప్లాన్ చేస్తుంది. అలాగే 2030 నాటికి అదనంగా  10 లక్షల కొత్త ఉద్యోగాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా కల్పించాలని  కంపెనీ భావిస్తుంది. 

►ALSO READ | H-1B, H-4 వీసాదారులకు కొత్త చిక్కులు: వీసా ఇంటర్వ్యూలు రద్దు.. ఎందుకంటే..?

 గతంలో మే 2023లో ప్రకటించినట్లుగా, ఈ కొత్త పెట్టుబడిలో కొంత భాగం తెలంగాణ, మహారాష్ట్రలో క్లౌడ్ & AI మౌలిక సదుపాయాలలో పెట్టనుంది. స్తువులను స్టార్ చేసి, ప్యాక్ చేసి పంపే సెంటర్లయిన ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు , రవాణా నెట్‌వర్క్‌లు, డేటా సెంటర్లు,  డిజిటల్ పేమెంట్ల వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ డబ్బును ఖర్చు చేయనున్నారు.

 భారతదేశం నుండి ఎగుమతులను వేగవంతం చేయడానికి అమెజాన్ "Accelerate Exports." అనే కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ కార్యక్రమం ఆన్‌లైన్ ద్వారా వస్తువులు అమ్మే చిన్న వ్యాపారులను, నమ్మకమైన తయారీదారులతో కలుపుతుంది. ఇలా తయారీదారులు  వస్తువులను ప్రపంచవ్యాప్తంగా అమ్ముకోవడానికి సహాయం చేస్తుంది.

తిరుపూర్, కాన్పూర్, సూరత్ వంటి 10 కంటే ఎక్కువ తయారీ ప్రాంతాలలో ప్రత్యేక ఆన్‌బోర్డింగ్ ఈవెంట్‌లను అమెజాన్ నిర్వహించనుంది. దీనికోసం, దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లడానికి భారత దుస్తుల ఎగుమతి ప్రోమోషన్ కౌన్సిల్‌తో కూడా అమెజాన్ డీల్ కుదుర్చుకుంది.