Ambajipeta Marriage Band: బ్యాండ్ గట్టిగానే మోగింది.. రెండురోజుల్లో సూపర్ కలెక్షన్స్

Ambajipeta Marriage Band: బ్యాండ్ గట్టిగానే మోగింది.. రెండురోజుల్లో సూపర్ కలెక్షన్స్

కలర్ ఫోటో(Color Photo), రైటర్ పద్మభూషణ్(Writer Padhmabhushan) వంటి హిట్ సినిమాల తరువాత నటుడు సుహాస్ నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజి బ్యాండు(Ambajipeta Marriage Band). దర్శకుడు దుశ్యంత్ కటికినేని(Dishyanth Katikineni) తెరకెక్కించిన ఈ రురల్ బ్యాక్డ్రాప్ మూవీ ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవుట్ అండ్ అవుట్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు మొదటి షో నుండే పాజిటీవ్ టాక్ రావడంతో.. ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 

దీంతో మొదటిరోజు సూపర్ కలెక్షన్స్ రాబట్టింది అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ఈ సినిమా రూ.2.28 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ రాబట్టింది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిత్ర యూనిట్. చాలా తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా..  అంచనాలను మించి  ఓపెనింగ్స్‌ను  సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది. ఇక రెండో రోజు కూడా అదే జోరు కంటిన్యూ చేసిన ఈ సినిమా దాదాపు రూ.3 కోట్ల వరకు కలెక్షన్స్‌ రాబట్టి ఉంటుందని అంచనా. ఇక ఫిబ్రవరి 9 వరకు కొత్త సినిమాలు లేకపోవడంతో ఈ సినిమాకుక్ మరిన్ని కలెక్షన్స్ వచ్చే ఆవకాశం ఉంది. అలా సుహాస్ కెరీర్ లో మరో సూపర్ హిట్ పడింది.