అన్ని ఫార్మాట్లకు అంబటి అల్విదా

అన్ని ఫార్మాట్లకు అంబటి అల్విదా

హైదరాబాద్​, వెలుగు: ఆరో ట్రోఫీని ముద్దాడి ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై చెప్పిన తెలుగు క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీఎస్కే బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంబటి రాయుడు అన్ని ఫార్మాట్ల క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. మరో దారిలో కలుద్దామని ట్వీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు.

‘ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విక్టరీతో ముగిసిన ఈ సందర్భంలో నేను ఇండియా క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అన్ని ఫారమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నుంచి రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించాలనుకుంటున్నా. చిన్నప్పుడు బ్యాట్​పట్టి ఇంట్లో టెన్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆడినప్పుడు నేను మూడు దశాబ్దాల పాటు ఇంత అద్భుతమైన ప్రయాణం చేస్తానని ఊహించలేదు. 2013లో తొలిసారిగా నేను ఇండియా క్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అందుకున్న రోజు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆరుసార్లు ఐపీఎల్ విజేతగా నా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముగిస్తున్నందుకు గర్వంగా ఉంది. కెప్టెన్ ధోనీతో కలిసి సీఎస్కేతో పాటు టీమిండియాకు ఆడటం నా అదృష్టం’ అని రాయుడు ఒక ప్రకటన విడుదల చేశాడు.

2013లో జింబాబ్వేపై తొలి వన్డే ఆడిన రాయుడు ఇండియా తరఫున 55 వన్డే మ్యాచ్​ల్లో 1694 రన్స్​ చేశాడు. 6 టీ20ల్లో 42 రన్స్​ చేశాడు. గత వన్డే వరల్డ్​ కప్​నకు ఎంపిక చేయకపోవడంతో రిటైర్మెంట్​ ప్రకటించిన అంబటి తర్వాత వెనక్కివచ్చినా మళ్లీ నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రాలేకపోయాడు. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  204 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆడిన రాయుడు 4348 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు.