అంబటి రాయుడుకు రెండో కూతురు.... ట్విట్టర్లో ఎమోషనల్ పోస్ట్..

 అంబటి రాయుడుకు రెండో కూతురు.... ట్విట్టర్లో ఎమోషనల్ పోస్ట్..

టీమిండియా మాజీ ఆటగాడు...చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మన్ అంబటి రాయుడు మరోసారి తండ్రయ్యాడు. రాయుడు దంపతులకు రెండో ఆడపిల్ల పుట్టింది. తనకు కూతురు పుట్టిన విషయాన్ని అంబటి రాయుడు సోషల్ మీడియాలో తెలియజేశాడు. కూతురు ఫోటోను షేర్ చేశాడు. ఈ సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. 

కూతుళ్లు నిజంగా...

తనకు కూతురు పుట్టడం పట్ల అంబటి రాయుడు సంతోషం వ్యక్తం చేశాడు.  కూతుళ్లు తండ్రులకు దక్కే  ఆశీర్వాదాలు అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఇక అంబటి రాయుడు తన స్నేహితురాలు చెన్నుపల్లి విద్యను 2009 ఫిబ్రవరి 14 న వివాహం చేసుకున్నాడు. 2020లో అంబటి రాయుడు చెన్నుపల్లి విద్య దంపతులకు 2020లో మొదటి ఆడపిల్ల జన్మించింది. ప్రస్తుతం చెన్నుపల్లి విద్య రెండో బిడ్డకు జన్మనిచ్చింది. 

సీఎస్కే శుభాకాంక్షలు..

అంబటి రాయుడుకు చెన్నై సూపర్ కింగ్స్  జట్టు యాజమాన్యం శుభాకాంక్షలు తెలిపింది. సూపర్ డ్యాడ్కు రెట్టింపు ఆనందం ..రాయుడు..అతని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు అని పేర్కొంది.   ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. 


పేలవ ఆటతీరు..

ఐపీఎల్ 2023లో అంబటి రాయుడు అంతంతమాత్రంగానే రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు ఒక్క కీలక ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. ఇప్పటి వరకు 12 మ్యాచులు ఆడిన రాయుడు..కేవలం 122 పరుగులే చేశాడు. అతని స్ట్రైక్ రేటు కూడా 127 మాత్రమే ఉండటం గమనార్హం.