రూమ్ ఒకటి.. క్లాస్లు ఐదు !

రూమ్ ఒకటి.. క్లాస్లు ఐదు !

ఒకే రూమ్​లో ఐదు క్లాసులు నిర్వహిస్తున్న దుస్థితి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్  నగర్​ కాలనీ ప్రైమరీ స్కూల్​లో ఉంది.  65 మంది విద్యార్థులు ఉండగా, ఇరుకిరుకుగా కూర్చుని  క్లాసులు వింటున్నారు. రెగ్యులర్ టీచర్లు ఇద్దరు ఉండగా, మరొకరు డిప్యూటేషన్​పై వచ్చారు.  ఈసారి 1వ తరగతిలో 21 మంది విద్యార్థులు చేరారు. 

 గతంలో కంటే ఈసారి అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. క్లాస్​ రూమ్​కు ముందు ఉన్న వరండాను కూడా  వినియోగించుకోవాల్సి వస్తోంది. ఉన్నతాధికారులు చొరవ చూపి  అదనపు క్లాస్ రూమ్ మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు.   - కామారెడ్డి, వెలుగు