12 నుంచి అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ క్లాసులు

 12 నుంచి అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ క్లాసులు

హైదరాబాద్: ఈ నెల  12 నుంచి అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ క్లాసులు ప్రారంభమవుతున్నట్లు హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ  కాలేజీ  ప్రిన్సిపల్ డా. కె. జ్యోత్స్న, స్టడీ సెంటర్​ కో ఆర్డినేటర్  శంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఫస్టియర్ 1వ సెమిస్టర్,  సెకండియర్ 3వ సెమిస్టర్, థర్డ్ ఇయర్  5వ సెమిస్టర్ల స్టూడెంట్లకు ఉదయం 9 గంటల నుంచి క్లాసులు  జరుగుతాయన్నారు.  స్టూడెంట్లు క్లాసులకు హాజరు కావాలని కోరారు.  ఇతర వివరాలకు 7382929771 నంబర్ ను సంప్రదించవచ్చని తెలిపారు.