- తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస రెడ్డి
బషీర్బాగ్, వెలుగు: పత్రికా రంగాన్ని రాజ్యాంగంలో బంధించకుండా అంబేద్కర్అడ్డుకున్నారని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస రెడ్డి అన్నారు. రాజ్యాంగంలో పొందుపర్చాలని అనేక మంది పట్టుబట్టినా.. ఆయన వ్యతిరేకించారని, పత్రికా రంగం ప్రజల తరఫున స్వేచ్ఛగా పని చేయాలని చెప్పారని గుర్తు చేశారు.
వయోధిక పాత్రికేయ సంఘం ఉపాధ్యక్షుడు ములుగు రాజేశ్వర్ రావు రచించిన నేను -బహువచనం(ఆత్మకథ), అధినాయక జయహే(కవితాసంకలనం) పుస్తకాలను ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. రాజేశ్వర్ రావు తనకు 40 ఏండ్లుగా తెలుసని, ఆయన రాసిన ఆత్మకథ నవల మాదిరిగా ఉందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వ మాజీ సీఎస్మోహన్కందా, మాడభూషి శ్రీధర్, వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షుడు దాసు కేశవరావు, టి.ఉడయవర్, లక్ష్మణరావుపాల్గొన్నారు.
